![]() |
![]() |
.webp)
బుల్లితెరపై ప్రసారం అవుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ `ఎన్నెన్నో జన్మల బంధం`. గత కొన్ని వారాలుగా ఆసక్తికర మలుపులతో సాగుతున్న ఈ సీరియల్ బుధవారం కీలక మలుపు తీసుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. కైలాష్ బండారం బయటపెట్టాలని యష్ .. సారిక సాయం కోరతాడు. దీంతో సారికి ఓకే అంటుంది. ఇంటికి వచ్చి కైలాష్ ఎలాంటి వాడో.. ఎంతటి దుర్మార్గుడో వివరిస్తానంటుంది. కట్ చేస్తే కైలాష్ పై కేసు పెట్టి బుద్ది చెప్పాలని వేద అక్క, తల్లి సులోచన రెడీ అవుతుంటారు. ఈ విషయం తెలిసిన కాంచన తన తల్లికి విషయాన్ని చెబుతుంది.
ఎంటే రంగంలోకి దిగిన మాలిని.. వేద కుటుంబాన్ని, ఆమె తల్లి సులోచనను నిలదీస్తుంది. ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరుగుతుంది. కట్ చేస్తే విషయం సీరియస్ అయ్యేలా వుందని గ్రహించిన కైలాష్ ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్లాన్ వేస్తాడు. తెలివిగా కాంచనని కూడా రెడీ చేయిస్తాడు. ఇద్దరు కలిసి బ్రీఫ్ కేస్ తో బయటికి వెళ్లిపోతుంటారు.. అది గమనించిన రత్నం, మాలిని ఆపే ప్రయత్నం చేస్తారు... అయినా ఆగకుండా కైలాష్ వెళ్లిపోయే ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో యష్ ఎంట్రీ ఇస్తాడు. నేనే వచ్చి సాగనంపుతానని చెప్పాను కదా అని కైలాష్ ని నిలదీస్తాడు. వెంటనే సారికని పిలిచి జరిగిన దంతా చెప్పిస్తాడు.
దీంతో షాక్ కు గురైన కైలాష్ రివర్స్ డ్రామా మొదలు పెడతాడు. దీంతో కాంచన కైలాష్ మాటలే వింటుంది. తను నమ్మడంతో కైలాష్ మరింతగా రెచ్చిపోయి వేద గురించి చెడుగా మాట్లాడటం మొదలు పెడతాడు. ఆ మాటలు విన్న వేద ఆగ్రహంతో ఊగిపోయి కైలాష్ పై విరుచుకుపడుతుంది. ఏం మాట్లాడుతున్నావురా అంటూ చెంప్ చెల్లుమనిపిస్తుంది. తన ముందే తన భార్య గురించి తప్పుగా మాట్లాడుతున్న కైలాష్ ని యష్ చితక్కొడుతాడు. అంతా ఆపడానికి ప్రయత్నిస్తున్నా ఎవరి మాట వినకుండా కైలాష్ పై వీరంగం వేస్తాడు. ఇంతలో పోలీసులు రావడం.. కైలాష్ ని అరెస్ట్ చేయడం జరిగిపోతుంది. అతన్ని స్టేషన్ కి తీసుకెళతారు. ఆ తరువాత యష్ ఇంతకు మించి నేను ఏమీ చేయలేనని చెబుతాడు. ఇంత జరుగుతున్నా తనకు వేద ఒక్క మాట కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
![]() |
![]() |